కోడి గుడ్డు పోషకాహారం అధికంగా వుండే పదార్ధాలలో ఒకటి. కాని కొల్లెస్టరాల్ కలిగిస్తుందంటూ చాలామంది వదలివేస్తారు. అయితే, గుడ్డుతో ఆహారం చేయటం అతి తేలిక. ఫ్రిజ్ లో ఎల్లపుడూ నిలువ వుంచుకుంటే, పిల్లలకు, పెద్దలకు ఎపుడు కావాలంటే అపుడు కొన్ని రకాల వంటకాలు గుడ్డుతో చేసుకోవచ్చు. పిల్లలు ఆకలి అంటూ సాయంత్రం ఇంటికి వచ్చినపుడు వాటితో ఎగ్ శాండ్ విచ్, లేదా కొన్ని వేపుడు కూరలతో కలిపి ఒక డిష్ గా చేసి ఇవ్వవచ్చు. ఇంటికి అనుకోని అతిధులు వస్తే, తేలికగా ఒక ఎగ్ క్రరీ చేసేయచ్చు. అదే బ్యాచులర్స్ అయితే కొంచెం డిఫరెంట్ టేస్ట్ కోసం సులభంగా ఎగ్ బిర్యాని చేసుకోవచ్చు. ఎక్కువ సమయం పట్టదు.  కావలసిన పదార్థాలు: బాస్మతి బియ్యం: 2 ఉడికించిన కోడిగుడ్లు: 8 నూనె: 1/2 నీళ్లు: 3 ఉల్లిపాయలు: 2 అల్లం, వెల్లుల్లి పేస్ట్: 2టేబుల్ స్పేూన్ పలావ్ ఆకులు: 2 దాల్చిన చెక్క: చిన్నది యాలకులు: 4 పసుపు: 1/2 tస్పూన్ కారం: 1టీ స్పూన్  గరం మసాలా పొడి: 1టేబుల్ స్పేూన్ కొత్తిమీర తురుము: 1/2కప్  ఉప్పు: తగినంత  తయారు చేయు విధానం: 1. మొదటగా నూనె లేదా నెయ్యి వేడి చేసి ఉల్లిపాయముక్కలు, అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేయాలి. 2. రెండు నిమిషాల తర్వాత పలావ్ ఆకు, దాల్చిన చెక్క, యాలకులు కూడా వేసి, బంగారు రంగు వచ్చేవరకూ వేయించాలి. 3. తర్వాత కోడి గుడ్లు, కారం, పసుపు వేయాలి. కోడిగుడ్లు రంగు మారాక బియ్యాన్ని వేయాలి. రెండు నిమిషాలు వేయించాక నీళ్లు పోయాలి. అందులోనే ఉప్పు, గరం మసాలా పొడి చల్లి మూత పెట్టాలి. 4. మీడియం మంట మీద ఉడికించి నీరంతా ఇమిరిపోయాక, పొడిపొడిగా అన్నం తయారయ్యాక కొత్తిమీర తురుము చల్లుకుని దించేసుకోవాలి. అంతే ఎగ్ బిర్యాని రెడీ. 

మరింత సమాచారం తెలుసుకోండి: